calender_icon.png 17 September, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

22-07-2024 12:21:42 PM

హైదరాబాద్: పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్జప్తి చేశారు. సచివాలయంలో మంత్రి పొన్నం సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విభజన చట్టానికి సంబంధించి రూ. 600 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రజాపంపిణీ విషయంలో కేంద్ర నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వాలేని మంత్రి కేంద్రాన్ని కోరారు. నిత్యవసర సరుకుల ధరల విషయంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సెషన్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్నారు.