22-07-2024 12:00:07 PM
అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.ఈ ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నిన్న రాత్రి 10.30 వరకు ఆఫీస్‌లోనే ఉద్యోగి గౌతమ్ తేజ ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసులో ఉండడంపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.