11 July, 2026 | 11:50 AM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ల శ్రీను బాబు   •   రైతు ఆశీర్వాద సభ కాదు... పచ్చి అబద్ధాల సభ   •   తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు: సీఎం రేవంత్   •   సురేందర్ రెడ్డి మృతి పై పలువురు నాయకుల సంతాపం   •   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ అవసరం   •   భారతనౌకదళం అమ్ములపొదిలో మరో అస్త్రం   •   ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను సైనికులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు   •   ఏడాదికి వెయ్యి మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయుడు.. వృక్ష ప్రేమికుడు బడిపంతులు   •   దైవాలగూడలో దారుణం.. ఆరుగురి హత్యపై స్పందించిన సీపీ తరుణ్ జోషి   •  

ఎల్ఏండీ లో చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి పొన్నం

03-10-2024 03:22 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన లోయర్ మానేరు డ్యాంలో 100 శాతం సబ్సిడీతో  చేప పిల్లల విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు డ్యాం లో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్  కమిషనర్ ప్రియాంక ఆలా,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నేత వెలిచాల రాజేందర్ రావు , కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ ,హుజురాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్, కార్పొరేటర్లు ,పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.