08-12-2025 01:34:22 AM
మొయినాబాద్, డిసెంబర్ 7(విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మొయినాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండలంలోని ఆయా పంచాయతీలో బరిలో నిలిచిన సర్పంచులు వార్డు సభ్యులు తమ మద్దతుదారులతో కలిసి ఉదయం రాత్రి వేళల్లో విస్తృతంగా ప్రజలను కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అధికారఅధికార ప్రతిపక్ష, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నువ్వా నేనంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండల వ్యాప్తంగా అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే గడుపుతూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప డతారో ఓటర్లకు వివరిస్తున్నారు. మైకులతో ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లను చే సుకుంటున్నారు. గ్రామాల్లో జట్ల వారీగా నాయకులు, కార్యకర్తలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల మద్దతున్న అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆక ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల మద్య గడుపుతు న్నారు. ఉదయంనుండి రాత్రి వరకు ప్రజల్లోకి వెళుతున్నరు. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14 రెండో విడత ఉండడంతో తమ ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశారు.ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచార హోరు పెంచారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ మద్దతు కూడా కడుతున్నారు.