calender_icon.png 27 December, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార రంగంలో కొండూరి సేవలు ఎనలేనివి

27-12-2025 04:46:15 PM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్,(విజయక్రాంతి):  సహకార రంగంలో కొండూరి రవీందర్రావు ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ డిసిసిబి చైర్మన్ గా 20 ఏళ్లుగా సేవలు అందించిన కొండూరు రవీందర్ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కొండూరు రవీందర్రావును ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆయన సహకార సంఘాల్లో ఉండేదన్నారు. రైతులకు సహకార సంఘాల ద్వారా వారికి నిరంతరం అండగా కొండూరు రవీందర్ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.