27-12-2025 04:52:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం పై తప్పకుండ ఒత్తిడి తెచ్చి పరిష్కరించేలా కృషి చేస్తానని బీజీఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిట్టు గజేందర్, జిల్లా అధ్యక్షులు భూమున్న యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ఉపాధ్యాయులను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జుట్టు గజేంద్రుడు ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా జుట్టు గజేందర్ ఎమ్మెల్యేకు పలు అంశాలు వివరించారు. తమ సంఘంలో జిల్లా నుండి రాష్ట్ర పదవికి అవకాశం రావడం ఇదే తొలిసారి అని వివరించారు. విద్యాహక్కు చట్టం (RTE) అమల్లోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ సమస్యతో తీవ్ర ఆందోళనకు చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్, పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్, జె. లక్ష్మణ్, నాయకులు ఇర్ఫాన్ శేఖ్, వెంకటేశ్వరరావు, లక్ష్మిపతి, లింగయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు