27-12-2025 05:49:33 PM
బైంసా,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుపై నిర్లక్ష్యం చేయవద్దని సెల్ ఫోన్ కు టీవీకి బానిస బానిస కావద్దని ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని వానల్ పహాడ్ మాటేగాం గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు తమ ట్రస్టు తరపున ఆయన ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలా అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.