calender_icon.png 27 December, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెలకువలు నేర్చుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలి

27-12-2025 06:01:21 PM

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): బోధనలో మెలకువలు నేర్చుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరుగాంచాలని జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుంభం  ప్రభాకర్ అన్నారు. గతవారం రోజులుగా పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సూర్యాపేట ఆర్కేఎల్కే బీఈడీ కళాశాల చాత్రోపాధ్యాయులను శనివారం అభినందించి మాట్లాడారు. క్రమశిక్షణ, అంకితభావంతో కృషిచేసి ఉపాధ్యాయ వృత్తిలో ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు.