calender_icon.png 27 December, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా అఖిల్

27-12-2025 05:56:38 PM

మునిపల్లి,(విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ చిన్నచెల్మెడ గ్రామ అధ్యక్షునిగా గ్రామానికి చెందిన గాడిఖాన అఖిల్ ను నియమించారు. ఈ మేరకు శనివారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తాన్నారు.

ఈ పదవి వచ్చేందుకు  సహకరించచి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజుతో  పాటు గ్రామ సర్పంచ్ రుద్ర గాయత్రి, సీనియర్ నాయకులు రుద్ర కృష్ణ, రాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు కమ్మరి నర్సింలు, మైనార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జావిద్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.