27-12-2025 06:26:47 PM
మర్రిగూడ,(విజయ క్రాంతి): మర్రిగూడ మండలం కమ్మగూడ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్నేని ఇజ్రాయిల్ (66) అనారోగ్యంతో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి శనివారం మృతదేహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మునుగోడు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సురిగి నర్సింహా గౌడ్, బిట్టు సత్యనారాయణ, సింగూ సంజీవరెడ్డి, దేవదాసు మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.