24-10-2025 10:33:23 AM
హైదరాబాద్: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు(Kurnool Bus Accident) కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై కర్నూల్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలను పొన్నం ప్రగడ సంతాపాన్ని తెలియజేశారు. తక్షణమే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్న ఆయన ప్రయాణికుల బంధువులు ఆందోళన చెంద వద్దని కోరారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. అవసరమైన సహాయచర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ బస్సుల వేగనియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బస్సుల్లో భద్రతాచర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణక కమిటీ వేస్తామని చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య అనారోగ్యకర ఫోటీ ఉంది, దాన్ని నివారిస్తామని సూచించారు. పూర్తి వివరాలు వచ్చాక ప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు