calender_icon.png 24 October, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

24-10-2025 10:54:48 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా(Komaram Bheem Asifabad Districtకాగజ్ నగర్ మండలం రాస్పెల్లి, సార్సాల గ్రామాల మధ్య పెద్దపులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్లు తెలిపారు.పెద్దపులి అడుగుజాడలను అటవిశాఖ అధికారులు నిర్ధారించారు. ఎవరు ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని గ్రామాల్లో డప్పు చాటింపు వేస్తున్న అటవిశాఖ అధికారులు తెలిపారు. రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. తెల్లవారుజామున తిరిగి సాయంకాలం వరకు ఎవరు కూడా పంట పొలాలలో రైతులు ఉండకూడదని ఫారెస్ట్ అధికారులు గ్రామాలలో దండోర వేయించారు.