01-01-2026 12:38:49 AM
డిప్యూటీ మేయర్‌ను కలిసిన నూతన డిప్యూటీ కమిషనర్
సికింద్రాబాద్ డిసెంబర్ 31 (విజయ్‌క్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తార్నాక సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుధ వారం తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ తార్నాక సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పారిశుధ్యం, డ్రైనేజీ,రహదారులు,తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిం చారు. ఈ అనంతరం నూతన డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ ప్రజల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తామని,క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా తార్నాక సర్కి ల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే దిశగా ఇరువురి మధ్య సానుకూల చర్చ జరిగినట్టు తెలియజేశారు.