17 April, 2026 | 8:28 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి..

11-12-2025 07:53 PM

ఉప్పల్ (విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ లో నివాసం ఉంటున్న బొమ్మిడి సబిత(50) తన ముగ్గురు పిల్లలతో కలిసి రాఘవేంద్ర నగర్ లో నివాసం ఉంటుంది. వృత్తిరిత్య కూరగాయల వ్యాపారం చేస్తున్న సబితా ఇటీవల కాలంలో ఇంటి వద్ద కాలుజారి కింద పడింది. దీంతో మోకాలు నడుముకు తీవ్రమైన గాయాలు జరిగాయి.

అంతకుముందుకే గొంతు దగ్గర గడ్డ కావడంతో ఆరోగ్యం కూడా సరిగా లేదు. బుధవారం రోజున రాత్రి అందరి లాగా నిద్ర పోయిన సబితా గురువారం పొద్దున ఎంత లేపిన లేవకపోవడంతో 108 సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించారు. అప్పటికే సబిత మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. అయితే సబిత కూతురు శిరీష తల్లి మృతిపై అనుమానం ఉందంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.