12-11-2025 08:07:59 PM
మంథని టీ వర్క్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పుస్తకాల పంపిణీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని జూనియర్ కళాశాలలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని (విజయక్రాంతి): నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు.
పిల్లల ఆలోచనలను పదును పెట్టేందుకు డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కృషి చేస్తుందని, మంథనిలోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫిడర్, ఆధునిక హెల్మెట్ తయారి వంటి ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంథనిలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యం వెలికి తీయడానికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 పాఠశాలల్లో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్న విద్యార్థులకు హైదరాబాద్ లోనే టీ వర్క్ సందర్శనకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు.
మంథనిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని పట్టణంలోని పోచమ్మ వాడలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు తూకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని, 48 గంటలో బ్యాంకు ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.
మంథనిలో సింథటిక్ టెన్నిస్ కోర్టును ప్రారంభింన మంత్రి శ్రీధర్ బాబు
మంథని పట్టణంలో జూనియర్ కళాశాలల ఆవరణలో రూ. 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సీఈఓ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్ కుమారస్వామి, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.