ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడాలి
గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషిచేయాలి
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథనిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
మంథని,మే 7(విజయక్రాంతి): ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకష్ణను అధిక మెజర్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మంథనిలో శ్రీధర్‌బాబు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కన్నాల మాజీ ఉపసర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్‌తోపాటు శ్రీనివాస్‌గౌడ్, పెయ్యల తిరుపతి పలువరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. మంథని పూసల సంఘం నాయకులు గుడ్ల సమ్మయ్య, కావేటి సమ్మయ్య అధ్వర్యంలో 50 మంది, మాల సంఘం ఆధ్వర్యంలో 50 మంది హస్తంగూటికి చేరారు. ఈ సందర్బంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పార్ల మెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల గురించి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, కాగ్రెస్ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. మంథని నియోజవర్గంలోని బహుజన సమాజ్ పార్టీకి చెందిన సూమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లోచేరారు. పట్టణానికి చెందిన సుమంత్‌రెడ్డి, ఓడేడు మల్లికార్జునస్వామి ఆలయ మాజీ అధ్యక్షుడు నారాయణరావుతో పాటు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.




