‘ఏ’దైనా కామనే!
‘ఏ’ గ్రేడ్ ధాన్యం కామన్ రకంగా కొనుగోలు
క్వింటాల్‌కు రూ.2౦ అన్నదాతలకు నష్టం
జిల్లాలో 1,04,841.31 ఎకరాల్లో వరి సాగు
మంచిర్యాల, మే 7 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకో వడానికి అన్నదాతలు అపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటి నుంచి మిల్లులకు వెళ్లేదాకా ఏదో ఓ రకంగా దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటివరకు తాలు, తప్ప పేరిట క్వింటాల్‌కు నాలుగై దు కిలోలు దోచుకొన్న మిల్లర్లు.. తాజాగా మరో కొత్త దందాకు తెరలేపారు. యాసంగిలో రైతులు 1010(గ్రేడ్ ‘ఏ’) రకానికి చెందిన వరి ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ, మిల్లర్లు 101౦ రకం ‘కామన్’ గ్రేడ్ కింద దిగుమతి చేసుకుంటున్నా రు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పు డు గ్రేడ్ ‘ఏ’ రకానికి చెందిన విత్తనాలుగా ఇచ్చిన రశీదును చూపించినా వారిని పట్టించుకోవడం లేదు. దీంతో క్వింటాల్‌కు రూ. ౨౦ నష్టపోతున్నారు. అన్నివిధాలా ఒక్కో క్వింటాల్‌పై దాదాపు రూ.౧౩౦ వరకు నష్టపోతున్నారు.
క్వింటాల్‌కు రూ.1౩౦ నష్టం
2023 యాసంగిలో జిల్లాలో 1,09,301.08 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ప్రధాన పంట అయిన వరి 1,04,841.31 ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా ‘ఏ’ గ్రేడ్ రకానికి చెందిన వరి జిల్లా లో అధికంగా సాగైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుక్స్‌లోసైతం నమోదు చేశారు. కానీ, మిల్లర్లు ‘ఏ’ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ కింద రిసీవ్ ఇస్తుండటంతో క్వింటాల్‌కు రైతుకు రూ.2౦ నష్టం వాటిల్లుతుంది. మరోవైపు తాలు, తప్పపేరిట రూ.110, ఇలా ఒక క్వింటాల్‌కు రూ.130 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేడ్ ‘ఏ’ రకాలు ఇవే
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ (పీజేటీఎస్) అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫైన్ వెరైటీ, కోర్స్ వెరైటీలను ప్రకటించింది. ఫైన్ వెరైటీలైన బీపీటీ 5204, తెలంగాణ సోనా, ఎంటీయూ 1061, హెచ్‌ఎంటీ సోనా, ఎంటీయూ 1224, బీపీటీ 3291, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు (32,100), బీపీటీ 2595, పొలాస ప్రభ (జేజీఎల్ 384), జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798), జగిత్యాల మసూరి (జేజీఎల్ 11470) లు గ్రేడ్ ‘ఏ’ కింద ప్రకటించారు. అలా గే కోర్స్ వెరైటీలైన ఎంటీయూ 1010, తెల్ల హంస (ఆర్‌ఎన్‌ఆర్ 10754), కేఎన్‌ఎం 118, ఐఆర్ 64, ఎంటీయూ 1153, జేజీఎల్ 24423, ఎంటీయూ 1156, భద్రకాళి (డబ్ల్యూజీఎల్ 3962) గ్రేడ్ ‘ఏ’ కాగా ఎంటీయూ 1001, ఇతర హైబ్రీడ్ విత్తనాలు కామన్ రకానికి చెందినవిగా ప్రకటించారు.
జిల్లాలో ‘ఏ’ గ్రేడ్ రకమే సాగు ఎక్కువ
2023 యాసంగి సీజన్‌లో జిల్లాలో రైతులు ఎక్కువ మొత్తంలో ‘ఏ’ గ్రేడ్ రకానికి చెందిన వరి పంటనే సాగు చేశారు. క్రాప్ బుకింగ్ ఆధారంగా వరి పంటలో రైతులు వివిధ వెరైటీల సీడ్‌ను వేసినట్టు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఎంటీయూ 1010 రకం 91,979.22 ఎకరాల్లో సాగు కాగా ఎంటీయూ 1001 రకం 393.23 ఎకరాల్లో, ఎంటీయూ 1156 రకం 5111.22 ఎకరాల్లో, ఎంటీయూ 1153 రకం 3219.24 ఎకరాల్లో, జేజీఎల్ రకం 1278.26 ఎకరాల్లో, కేఎన్‌ఎం రకం 545.16 ఎకరాల్లో సాగు కాగా సీడ్ ప్రొడక్షన్ కోసం 867.35 ఎకరాల్లో, బీపీటీ, తదితర వివిధ రకాలు 1,446.97 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. రైతులకు గ్రేడింగ్ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
సురేఖ, ఇన్‌చార్జి జిల్లా
వ్యవసాయాధికారి, మంచిర్యాల




