11-01-2026 12:00:00 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి
కోరుట్ల, జనవరి10(విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెం డర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పత్రికా రంగంలో ఊహాజనితాలకు తావులేకుండా నిజాన్ని నిర్భయంగా ప్రచురించే దినపత్రిక విజయక్రాంతి అని ప్రశంసించారు. యాజమాన్యం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ కోరు ట్లలో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జు వ్వాడి నరసింగరావు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాట్లాడుతూ పత్రిక ప్రారంభించిన అనాతి కాలంలోనే మంచి ఆదరణ పొందిందని, రానున్నకాలంలోమరింత పాఠక ఆదరణపొందాలని కొనియా డారు. కార్యక్రమంలో విజయక్రాంతి ఆర్సీ ఇన్‌చార్జి తీగల శోభన్‌రావు, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.