calender_icon.png 12 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేవైఎం ఆందోళన, ఉద్రిక్తత

11-01-2026 12:00:00 AM

అశోక్‌నగర్ కేంద్ర గ్రంథాలయం వద్ద వాగ్వాదం అరెస్టులు

ముషీరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం  బీజేవైఎం ఆధ్వర్యంలో ఛలో అశోక్ నగర్ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవ డంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

పోలీసులు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో  మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను బట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.