calender_icon.png 29 December, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుమలపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

29-12-2025 03:42:31 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): డిసెంబర్ 28న  కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెలుమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక బాధ్యతగల పదవిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి కొడంగల్ సభలో వ్యక్తిగత కక్షతో అహంకాపూరితమైన వెలమలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు మేము మీ ముందు వ్యక్తపరుస్తున్నాం.

మీ జాతి మొత్తాన్ని తెచ్చుకోండి అని పద్ధతిలో కక్షతో ఆవేశపూరితంగా వాక్యానించడాన్ని ఖండిస్తున్నామని, రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ వెలమ సంఘ కార్యదర్శి కాకులమర్రి ప్రవీణ్ రావు, సభ్యులు సిద్ధుర్ స్వామి రావు, పల్లెపాడు విద్యాసాగర్ రావు, లింగంపల్లి పాపారావు, తక్కల్లపల్లి అమృతారావు, తక్కల్లపల్లి బలరాం రావు తదితరులు పాల్గొన్నారు.