calender_icon.png 3 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యం: మంత్రి వివేక్

03-08-2025 12:11:36 AM

అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): పేద ప్రజలకు ఉచిత విద్య అందజేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.శనివారం పట్టణంలోని కాకతీయ కాలనిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి  ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి అర్హులకు లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.మంత్రి మాట్లాడుతూ రెండు వందల కోట్లతో వ్యయంతో ఒక్కొక్క నియోజక వర్గంలో నూతన తరహాలో పాఠశాలలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని అన్నారు.ఇప్పటికే అర్హులైన పేదలకు డబల్ బెడ్ ఇండ్లను పంపిణీ చేశామని,అలాగే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవాళ్లు కలిగిన వారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని సూచించారు.