calender_icon.png 3 August, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి

03-08-2025 12:12:21 AM

- రిజర్వేషన్ల కోసం బీసీలంతా సంఘటితంగా పోరాడాలి

- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు 

ఖైరతాబాద్; ఆగస్టు 2 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభు త్వానికి పంపించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ ముదిరాజ్ అధ్యక్షత నిర్వహించిన విలేకరుల సమావేశానికి మాజీ రాజ్యసభ సభ్యుడు  హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జన సమితి ఉపాధ్యక్షుడు పి ఎల్ విశ్వేశ్వరరావు  తదితరులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు... బీసీ రిజర్వేషన్ల అమలుకై బీసీలంతా సంఘటితమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే సమయం ఆసన్నమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి సిద్ధంగా ఉన్న బిజెపి పార్టీలోని నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. బీసీ కేంద్రమంత్రి బండి సంజయ్ ‘తొండి సంజయ్’లా మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

బీసీ బిల్లుకు బిజెపి పార్టీ మద్దతు తెలపాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో బీసీలు బిజెపికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ,బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్, గౌడ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నేతలు గణేష్ చారి, లక్ష్మణ్ యాదవ్, సాంబశివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.