calender_icon.png 29 July, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కామారెడ్డి జిల్లాకు మంత్రులు సీతక్క, పొంగులేటి రాక

29-07-2025 12:27:17 AM

కామారెడ్డి, జూలై 28, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన ఖరా రైంది.జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క , రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  జిల్లాకు మంగళవారం రానున్నారు. వీరు దోమకొండ  మండల కేంద్రంలో నిర్వహించే నూతన రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.

జిల్లాలో ఇప్పటికే 2.60 లక్షల పాత రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం జిల్లాకు 15,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా 48,971 కార్డుల్లో కొత్తగా సభ్యులను చేర్చారు. దోమకొండ మండలానికి చెందిన 352 కొత్త రేషన్ కార్డులు, 1,841 మెంబర్ యాడింగ్ కార్డులు, బీబీపేట మండలా నికి చెందిన 555 కొత్త రేషన్ కార్డులు, 1,547 మెంబర్ యాడింగ్ కార్డులను లబ్ధిదారులకు మంత్రులు పంపిణీ చేయనున్నారు. మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్‌లో పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు.