calender_icon.png 29 August, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు భూపాలపల్లిలో మంత్రుల పర్యటన రద్దు

20-07-2024 01:41:02 PM

జయశంకర్ భూపాలపల్లి: ఈనెల 21 న భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పర్యటన జిల్లా వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లాలో అన్నిచోట్ల వర్షపాతం ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించడంతో మంత్రుల పర్యటన రద్దు కావడం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నియోజవర్గంలోని కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే ఎంపీడీవో ఎమ్మార్వో కార్యాలయం భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమానికి, గణపురం మండలంలోని గాంధీనగర్ మైలారం గుట్టలో సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీలు పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే పర్యటన రద్దు అయిందని తెలిపారు.