03-05-2025 12:44:19 AM
ముఖ్య అతిథులుగా హాజరుకాన్న మంత్రులు
ఖైరతాబాద్, మే 2 (విజయక్రాంతి) : సగర కులస్తుల ఆరాధ్య దైవం భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఈనెల 4న రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సగర సంఘం తెలిపింది.
ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి బిసి సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలరాజ్, సీనియర్ జర్నలిస్ట్ మారుతి సాగర్, సగర సం గం ప్రధాన కార్యదర్శి సత్యం తదితరులతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం వారు మా ట్లాడుతూ.. భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధిక నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, క్యాబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా ఒక జీవోను జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రు లు సీతక్క, కొండా సురేఖ లతోపాటు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ సగర మహిళా సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లవి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.