calender_icon.png 23 May, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్‌వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం నోటీస్

23-05-2025 12:19:51 AM

  1. ఇదే రేవంత్‌రెడ్డి రాజకీయం
  2. మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ బ్యూటీస్ కా ళేశ్వరం నోటీస్ ఇదే రేవంత్‌రెడ్డి రాజకీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లు బయటపడుతున్నాయనే ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారని అన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక విచారణ పూర్తయిందని, మళ్లీ ఎం దుకు పొడగించారని ప్రశ్నించారు. 

 తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రజాపాలన పర్సంటేజీల పాలనగా మారిందని, దా న్నించి దృష్టిని మరల్చేందుకే ఈ నోటీసులన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే నోటీసుల అజెండా అన్నారు.