25-07-2025 10:40:09 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తప్పిపోయిన ఓ బాలుడిని బ్లూ కోర్టు కానిస్టేబుళ్ళు తల్లిదండ్రులకి అప్పగించిన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియాని వాసి రాజస్థాన్ కు చెందిన బాలుడు బజార్ కి వెళ్తున్న తల్లిదండ్రుల వెంట వారికి తెలియకుండానే బజారుకు వెళ్లి తప్పిపోయాడు. పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో ఏడుస్తూ కనిపించిన బాలుడిని పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బాలుడు తప్పిపోయిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేసేందుకు పోలీసులు వాట్సప్ గ్రూపుల్లో ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇదే క్రమంలో బజారుకు నుంచి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ కుమారుడు తప్పిపోయిన విషయం తెలుసుకొని బాలుడి కోసం మళ్లీ బజారుకు వెళ్లారు. బాలుడి నీ తల్లిదండ్రులకు అప్పగించేందుకు బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్ బస్తీల్లో వాకప్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులు ఏఎంసీ ప్రాంతంలో పోలీసులకు తారాసపోడడంతో బాలుడిని వారికి అప్పగించారు. దీంతో బాలుడి అదృశ్యం సుఖాంతమైంది. మిస్సయిన బాలుడి నీ తల్లిదండ్రులకి అప్పగించడంలో ఎంతో చాకచక్యతను చూపించిన బ్లూ కోర్టు సిబ్బంది రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్ లను పలువురు అభినందించారు. ముఖ్యంగా బాలుడి తల్లిదండ్రులు మాత్రం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.