25-07-2025 10:38:04 PM
రామకృష్ణాపూర్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పిఏ రమణ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు నియోజకవర్గ ఇంచార్జి రాజా రమేష్ తెలిపారు. దళిత వర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రమణ రావు తప్పడు ఉద్దేశ్యంతో వాట్సాప్ గ్రూప్ లలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పిఏ రమణ రావు చేసిన అసత్యప్రచారాల వల్ల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ల్లో బాల్క సుమన్ పై అసత్యప్రచారం చేసిన రమణ రావు పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.