25-10-2025 12:00:00 AM
మెదక్, అక్టోబర్ 24 : మెదక్, హవేళీ ఘణపూర్ మండలాల్లో మిషన్ భగీరథ మంచినీటి పంపిణీకి అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పల్లవి తెలిపారు. శుక్రవారం ఆమె హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట పంపింగ్ స్టేషను సందర్శించారు. హవేలీ ఘన్పూర్ మండలంలోని 32 గ్రామాలకు, అలాగే మెదక్ మండలంలోని రెండు గ్రామాలకు జక్కన్నపేట ఐపీఎస్ (ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్) నుండి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని, అయితే జక్కన్నపేట్ పంపింగ్ స్టేషన్లోని రెండు పంపులు పనిచేయక పోవడంతో వాటి మరమ్మత్తుల కోసం మూడు, నాలుగు రోజులు పంపింగ్ నిలిపివేయడం జరిగిందన్నారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు స్థానిక నీటి వనరులను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డీఈ వెంట ఏఈ రజిత, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.