calender_icon.png 21 August, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

21-08-2025 07:44:23 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 23, 24 తేదీల్లో వాలీబాల్ పోటీలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు సాయిచందు రెడ్డి ఓం ప్రకాష్ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారే పోటీలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. క్లస్టర్ స్థాయిలో నిర్వహించే పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పది వేలు, ద్వితీయ బహుమతిగా ఏడు వేల, తృతీయ బహుమతిగా ఐదు వెలు, నాలుగవ బహుమతిగా ముడు వేలుగా నిర్ణయించారు.

విజేతలుగా నిలిచినవారు సెప్టెంబర్ లో హైదరాబాదులో జరిగే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఫైనల్ పోటీలు సెప్టెంబర్ 21 తమిళనాడులోని కోయంబత్తూర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైనల్ విజేతలకు మొదటి బహుమతిగా ఐదు లక్షలు ద్వితీయ బహుమతిగా మూడు లక్షలు తృతీయ బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తారమ్మన్నారు. ఉత్సాహవంతులైన గ్రామీణ ప్రాంతా యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు శశికళ, లతా పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9951530526,89858 94804. నంబర్లను సంప్రదించాలని కోరారు.