calender_icon.png 21 August, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల దాడిలో మహిళకు గాయాలు

21-08-2025 07:46:11 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండల కేంద్రంలో కోతుల దాడిలో కందునూరి మల్లిఖాంబ గాయపడ్డారు. ఆమెపై కోతుల గుంపు దాడి చేసి పలుచోట్ల గాయపరచగా వాటి నుండి కాపాడుకునేందుకు పరిగెత్తి కింద పడడంతో చెయ్యి కూడా విరిగింది. గ్రామంలో రోజురోజుకు కోతుల బెడద తీవ్రంగా మారిందని, అధికారులు స్పందించి కోతుల నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.