01-05-2025 09:41:16 PM
అధికారులకు ఎమ్మెల్యే పాయల్ సూచన..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం వార్డ్ ఆఫీసర్లతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, లబ్ధిదారుల ఎంపిక, తదితరంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్ల అందేవిధంగా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపిక జాబితాలో అనర్హులు ఉంటే వారిని తొలగించి అర్హులను చేర్చాలని అధికారులను ఆదేశించారు.