01-05-2025 09:45:35 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోదావరిఖని పట్టణానికి చెందిన వేల్పుల ఓదెలును గురువారం రెన్ హాస్పిటల్ లో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. ఓదేలుకు ధైర్యం చెప్పిన వినోద్ కుమార్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓదెలు గాయపడ్డారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, శేఖర్ ఉన్నారు.