calender_icon.png 2 May, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే అధికారులకు రక్షణ కల్పించాలి

01-05-2025 09:49:22 PM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి సంఘీభావంలో జిల్లా వైద్యాధికారులు..

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే అధికారులకు రక్షణ కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారికి సంఘీభావంలో జిల్లా వైద్యాధికారులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య అధికారి అన్న ప్రసన్న కుమారి గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో ఇటీవల తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించి తగిన చర్యలు తీసుకొనుచుండగా, విధులకు అడ్డుపడడం, వారిపైనే యజమాన్యం వారి ఉద్యోగుచే  కేసు పెట్టించడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఖండిస్తూ జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, సీనియర్ డాక్టర్లు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే అధికారులకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.