calender_icon.png 28 October, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంజీవ్ ముదిరాజ్‌ను అభినందించిన ఎమ్మెల్యే

28-10-2025 01:15:30 AM

మహబూబ్ నగర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ ను మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఎమ్మెల్యే ని కలిసిన సంజీవ్ ముదిరాజ్ ను ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా క్లబ్ ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చే యాలని, సభ్యుల సౌకర్యార్థం జిల్లా క్లబ్ లో అన్ని సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంజీవ్ ముదిరాజ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, పులిజాల రవికిరణ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.