calender_icon.png 28 October, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

28-10-2025 01:17:32 AM

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

మిడ్జిల్ అక్టోబర్ 27 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతును రాజుగా చేసే విధంగా రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అ న్నారు. సోమవారంమండల పరిధిలోని రా ణి పేట గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం మం డల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేం ద్రాన్ని బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి ప్రా రంభించారు.తదనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో కల్యాణ లక్ష్మి షాదీ ము బారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండిం చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చే స్తుందన్నారు వరి ధాన్యం పత్తి మొక్కజొన్న విక్రయించే రైతులందరికీ కనీసం మద్దతు ధరతో దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతు అభ్యున్నత ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రణాళికలతో ముందు కు సాగుతుందన్నారు.

రైతులు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా పారదర్శకంగా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు.  తల్లిదం డ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు ఎం తో మేలు చేస్తాయన్నారు. 

ఈ కార్యక్రమం లో తహసిల్దార్ పులి రాజు. ఎంపీడీవో గీతాంజలి. ఏవో సిద్ధార్థ, డైరెక్టర్లు, మండల నా యకులు మహమ్మద్ గౌస్, సాయిలు, రబ్బాని, అశోక్, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రైతులు మహిళలు ఆయా గ్రామాలనుండి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.