22-10-2025 04:30:27 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్దిదారులకు అందజేశారు. ఇప్పటివరకు మంజూరీ ఐన ఆరుగురు లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రం, కాంగ్రెస్ నాయకులూ ఈది గణేష్, బండ్ల రజిని, శ్రీనివాసరాజు, ఆర్ఐ లు, తహశీల్ధార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.