calender_icon.png 28 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

28-08-2025 08:41:13 PM

చిట్యాల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతువేదికలో మండల పరిధిలోని లబ్ధిదారులకు గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రజా పాలనలో లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ,మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య,టేకుమట్ల మాజీ జడ్పీటిసి పులి తిరుపతి రెడ్డి,మూల శంకర్ గౌడ్,బుర్ర లక్ష్మణ్ గౌడ్,బుర్ర శ్రీనివాస్,యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్,మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్ తదితరులు పాల్గొన్నారు.