28-08-2025 11:09:49 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గ్రామీణ బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న వ్యక్తి దగ్గర నుండి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 40 వేలు చోరీ చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దహేగాం మండలం కల్వాడ గ్రామానికి చెందిన పెద్దల ఆశన్న అనే వ్యక్తి అవసరాల రీత్యా ఇంట్లో నుండి తెచ్చిన బంగారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో గల బంగారు దుకాణంలో కుదువ పెట్టి వచ్చిన రూ. 40 జేబులో పెట్టుకొని గ్రామీణ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా జేబులోని డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు తనకు జరిగిన అన్యాయం గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని బస్సులో తనిఖీలు చేశారు. ప్రయాణికులెవరి వద్ద డబ్బులు లభించకపోవడంతో ఇది గుర్తు తెలియని వ్యక్తుల పని అయి ఉంటుందని భావించారు. బాధితుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.