28-08-2025 08:37:56 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ(Orient Cement Company) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. గత కొద్దిరోజులుగా ఎంతో ఉత్కంఠగా రేపిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కార్మిక శాఖ అధికారులతో పాటు, బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా ఈ ఎన్నికలలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాలరావు(తరాజు గుర్తు), మంత్రి గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల మద్దతుదారుడు విక్రమ్ రావు(పెద్ద పులి గుర్తు)ల మధ్యనే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మరో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికలలో పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకు ఈ ఎన్నికలు ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తాయి. ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా దేవాపూర్ ప్రాంతంలో పోలీసులు గురువారం సాయంత్రం కవాతు నిర్వహించారు. కాగా 257 మంది కార్మికులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కుతో ఉత్కంఠకు తెరదింపనున్నారు.