28-08-2025 11:05:42 PM
బాన్సువాడ గుడిమి రాకపోకలకు దారి బంద్
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండలంలోని బుడిమి-తాడుకోల్ మధ్య వాగు భారీగా వర్షాల కారణంగా పొంగి పొర్లింది. దీంతో వాగుపై రహదారిపై నీరు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితి విషమించకుండా గ్రామపంచాయతీ అధికారులు, సెక్రటరీ స్రవంతి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు తగ్గే వరకు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.