calender_icon.png 7 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

07-05-2025 12:00:00 AM

తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్‌రెడ్డి

చిగురుమామిడి, మే 6 : వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం చిరుమామిడి మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.  సోమవారం కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను  ఓగులాపూర్ గ్రామంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ  చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను,

మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటి పెళ్లి లింగయ్య, బోయిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు