calender_icon.png 31 August, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

31-08-2025 05:30:04 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన పెద్దబోయిన తన్వి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ నిమిత్తం రూ.2,50,000 అవసరం ఉండగా, స్థానిక కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని కేవలం గంట వ్యవధిలోనే ప్రభుత్వం నుండి అట్టి మొత్తం రూపాయలను మంజూరు చేయించారు. ఎల్ఓసి చెక్కును సచివాలయంలో తన్వి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో ఖరీదైన చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ఎల్ఓసీ చెక్కులు ప్రాణదానం చేస్తున్నాయన్నారు. కష్ట కాలంలో ఆదుకుంటూ, దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఓసీతో చికిత్స సహాయం పొందుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఆపద కాలంలో తమ కుటుంబానికి అండగా ఉంటూ ఎల్ఓసీ చెక్కు రూపంలో సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యేకు తన్వి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట టేకుమట్ల మాజీ జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.