31-08-2025 05:40:10 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ సోషల్ మీడియా ఆసిఫాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా జైనూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ ఫజల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొడతామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు మరింత చేరువచేసేందుకు కృషి చేస్తానన్నారు. నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ , మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , టీపీసీసీ ఉపద్యక్షురాలు సుగుణక్క, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్ , జైనూర్ మండల కాంగ్రేస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.