29-07-2024 05:45:50 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది.. 3 సమావేశాల్లోనూ సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడగానే ఒక కాగితం తీసుకొచ్చి చర్చను తప్పుదోవ పట్టిస్తారని, గతంలో గోదావరి జలాల విశ్రాంత ఇంజనీర్ల నివేదికను ప్రస్తావించారన్నారు. మేడిగడ్డ సాధ్యం కాదు అని విశ్రాంత ఇంజనీర్లు చెప్పలేదని, మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు తరలించవద్దన్నారు.
సీఎం ఉద్దేశపూర్వకంగా కొన్ని మాత్రమే చదివి మిగితా వాటిని విస్మరిస్తున్నారని, విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం మూడు పదాలు ఎదరగొట్టి చదివారని హరీశ్ రావు తెలిపారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామన్నారు.మీటర్లు పెట్టడానికి అంగీకరించారని సీఎం తప్పుదోవ పట్టించారని, ఇవాళ పోతిరెడ్డిపాడు విషయంలో కూడా తప్పుదోవ పట్టించారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే వైఎస్ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నామని, పదవుల కోసం పాకులాడేది రేవంత్ రెడ్డే... మేము కాదన్నారు. నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశానని, అమరవీరులను కించపరిచేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్ రావు వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎప్పటికీ పోదు, తప్పకుండా మళ్లీ వస్తుందన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలు వీహెచ్ లాంటి వాళ్లు పక్కకు పోయారు. 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా సాయం రాదని, డిసెంబర్ 9 తర్వాత రైతులపై వడ్డీ భారం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.20 వేల కోట్లు చెల్లింపులు చేశామని, ప్రతి నెలా రూ.200-300 కోట్లు వరకు చెల్లింపులు చేస్తూ వచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని,