29-07-2024 06:04:29 PM
హైదరాబాద్: రైతుల పంటల రుణమాఫీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రెండో విడత రుణమాఫీని మంగళవారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడుతలో రూ.లక్ష నుంచి 1.50 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ కానున్నాయి. రాష్ట్రంలో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులు 6 లక్షల మంది ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 7 వేల కోట్ల నిధులను జమ చేస్తుంది. అసెంబ్లీ ఆవరణలో రుణమాఫీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడుత రుణమాఫీలో లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలలో అత్యంత ప్రదానమైనది.