calender_icon.png 11 May, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు బడుల ఆణిముత్యాలకు ఎమ్మెల్యే సన్మానం

10-05-2025 12:27:31 AM

పెబ్బేరు ఎప్రిల్ 9: మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు స్తానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఘనంగా సన్మానించారు. మండల పరిధిలోని వై శాగాపూర్ గ్రామానికి చెందిన జిల్లా టాపర్ బి. నందిత 600 మార్కులకు గాను 578,కే అనూష 548, పెబ్బేరు ఎంజేపి. జానకిరామ్ 546 మోడల్ స్కూల్, రాంచరణ్ 522 కంచిరావుపల్లి, ఎస్ కే రజియా బేగం 515 రంగాపురం, ఎం శివాణి 511 సూగూర్, ఐశ్వర్య 502 కస్తూరిబా పెబ్బేరు, నవ్య 487 పెబ్బేరు, ఆస్మా బేగం 484 అయ్యవారి పల్లి, శివాని 460 యాపర్ల, స్వప్న 442 పెబ్బేరు బాలికల ఉన్నత పాఠశాల,

కె. నరేష్ 440 గుమ్మడం, టి. మేనక 421 వైశాగాపూర్ విద్యార్థులకు శాలువాలతో సన్మానించి స్వీట్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందులో తీసిపోమని గర్వంగా ఈ ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు దృఢమైన సంకల్పం తో చదివితే విజయాలు వాటంతట అవే వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయరాములు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయ వర్దన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెసుఅధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ సాగర్,దయాకర్ రెడ్డి, రణధీర్ రెడ్డి, రవీంద్ర నాయుడు నర్సింహ నాయుడు, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.