06-12-2024 12:00:00 AM
మంచిర్యాల, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఆడ బిడ్డలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. గురువారం మంచిర్యాల డిపో ఆవరణలో ‘ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం’ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై పలువురు మహిళా ప్రయాణికులను సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జనార్దన్ పాల్గొన్నారు.