22-08-2025 12:00:00 AM
కాగజ్‌నగర్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 49 రద్దుచేసి, పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మె ల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష కొనసాగుతుంది. గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి సం దర్శించి, ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రభు త్వం విఫలమైందన్నారు. మద్దతు తెలిపి పరామర్శించిన వారిలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, భారతీయ జన తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమ్మాజి, ముకేష్ గౌడ్, పులగం తిరుపతి ,ఆంజనేయులు, గోవర్ధన్, సంతోష్, శ్రీనివాస్, కార్యకర్తలు ఉన్నారు.