calender_icon.png 22 August, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో పలువురు బీజేపీ నాయకులు చేరిక

22-08-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, ఆగస్టు 21(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు(బీజేపీ)పై ఆసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొంగ సత్యనారాయణతో పాటు, పలువురు నాయకులు పార్టీ గులాబీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నా రు.  ఎమ్మెల్యే హరీష్ బాబు వైఖరి వల్లే తాము బీజేపీని వీడినట్లు వారు వివరించా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.